Saturday, December 7, 2024

తెలంగాణలో 270 కోట్ల మొక్కలు నాటాం – సభాపతి పోచారం

బాన్స్ వాడ – తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో హరితర కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్ప‌టి 270 కోట్ల మొక్కలను నాటార‌ని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా కోటి వృక్షార్చ‌న కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సభాపతి మొక్క‌లు నాటారు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం 2016 లో తెలంగాణ కు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించార‌న్నారు… ప్రకృతి దేవుడు ఇచ్చిన వరమ‌ని,దానిని మ‌నం కాపాడితే అది మ‌న‌ల‌ను కాపాడుతుంద‌ని అన్నారు..

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్, ఆర్డిఓ భుజంగరావు, నాయకులు అంజిరెడ్డి గంగాధర్ నరసింహులు కళాశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement