Wednesday, May 15, 2024

వారంలో పీఈసెట్‌ నోటిఫికేషన్‌

టీఎస్‌ పీఈసెట్‌-2022 నోటిఫికేషన్‌ మరో వారంరోజుల్లో వెలువడనుంది. ఈ నోటిఫికేషన్‌ను మహాత్మాగాంధీ యూనివర్శిటీ విడుదల చేయనుంది. బీపీఎడ్‌, డీపీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ స్టేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ పీఈసెట్‌)ను నిర్వహించనున్నారు. ముందస్తుగా ఈనెల 11వ తేదీ తర్వాత దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్‌లో ప్రారంభంచాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ తేదీలను మార్చే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400, మిగతా కేటగిరీల విద్యార్థులకు రూ.800గా ఫీజు నిర్ణయించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే టీఎస్‌ పీఈసెట్‌ నోటిఫికేషన్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారికంగా విడుదల చేయకముందే నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు బయటికొచ్చాయి. దీంతో తేదీలను త్వరలో ప్రకటిస్తామని పీఈసెట్‌ కన్వీనర్‌ వివరణ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement