Saturday, May 18, 2024

Peddapalli – ప్రతిపక్షాలకు మరోసారి భంగపాటే … గులాబీ జెండా ఎగరడం ఖాయం.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి – అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మరోసారి భంగపాటు తప్పదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. శనివారం ఓదెల మండలం కనగ ర్తిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గత 40 ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నర ఏళ్లలో చేసి చూపామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. రైతాంగానికి ముందస్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎకరానికి ప్రతి ఏడాది 10 వేల రూపాయలు పంట పెట్టుబడి కింద అందిస్తున్నామన్నారు.

రైతు బీమా, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, మైనార్టీ బందు, బీసీ బందు, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్టు, బ్రేక్ ఫాస్ట్ పథకం లాంటి ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ఓట్ల కోసం ప్రతిపక్షాలు దొంగ హామీలు ఇస్తాయని వాటిని నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మరోసారి కరెంట్ కష్టాలు తప్పవని, మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందన్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలు తెలంగాణలో అమలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

దమ్ముంటే తెలంగాణ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత రెండు ఎన్నికల్లో ఆదరించిన విధంగానే మరోసారి కారు గుర్తుకు ఓటేసి గులాబీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement