Monday, April 29, 2024

TSRTC: బస్ టికెట్ల కోసం కొత్త సేవలు

టీఆర్ఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు పలు చర్యలు తీసుకుంటన్నారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో తరచూ ఎదురవుతున్న చిల్లర సమస్యలకు షరిష్కారం కొత్త సేవలను ప్రారంభించారు. సికింద్రాబాబాద్ జే‌బీ‌ఎ‌స్‌లో యూపీఐ, క్యూఆ‌ర్‌‌కోడ్‌ చెల్లిం‌పుల ద్వారా టికెట్లు ఇచ్చే నూతన సేవ‌లను ప్రారం‌భించారు. ఇప్ప‌టికే సికిం‌ద్రా‌బా‌ద్‌‌లోని రేతి‌ఫైల్‌, ఎం‌జీ‌బీ‌ఎ‌స్‌ ‌లోని టికెట్‌ బుకింగ్‌, రిజ‌ర్వే‌షన్‌ కౌంటర్‌, పార్సిల్‌, కార్గో కేంద్రాల్లో ఈ తరహా సేవలు కొన‌సా‌గు‌తు‌న్నా‌యి. ప్రయా‌ణి‌కుల నుంచి మంచి ఆద‌రణ, స్పందన లభిం‌చ‌డంతో జేబీ‌ఎ‌స్‌లో సైతం ప్రారం‌భిం‌చి‌నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రయా‌ణి‌కులు తమ సల‌హాలు, సూచ‌నలు ట్విట్టర్ ద్వారా తెలి‌య‌జే‌యా‌లని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: ఎగిరే బైక్ ని చూశారా?.. ధర ఎంతంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement