Saturday, May 11, 2024

టాస్క్ లో గెలిచిన ష‌ణ్ముఖ్..హ‌గ్ చేసుకున్న సిరి

మొద‌టిసారి గేమ్ లో గెలిచాడు ష‌ణ్ముఖ్..బిగ్ బాస్5 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది..ఇప్ప‌టి వ‌ర‌కు గేమ్స్ లో పాల్గొన‌ని వారు కూడా పాల్గొంటూ బుల్లితెర వీక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటున్నారు. ఈవారం నామినేషన్స్ ప్రక్రియను కాస్త డిఫరెంట్‏గా చేశారు బిగ్‏బాస్. లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు. కాగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గా అభయహస్తం ఇచ్చాడు బిగ్ బాస్… ఈ టాస్కులో భాగంగా లాక్ డౌన్ ఉంటుందని.. ఇంటి సభ్యులు మొత్తం గార్డెన్ ఏరియాలోనే ఉంటారని బిగ్ బాస్ తెలిపాడు.

దాంతో కెప్టెన్సీ కంటెండర్ పోటీలో గెలిచిన వారు మాత్రమే ఇంట్లోకి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ టాస్కులో మొత్తం ఐదు ఛాలెంజ్‏లు ఉంటాయి… మొదటి ఛాలెంజ్‏లో ఓడిపోయిన వారు రెండో ఛాలెంజ్‏లో పాల్గోనే అవకాశం ఉంటుంది. దీంతో మొదటి ఛాలెంజ్‏లో ముందుగా షణ్ముఖ్, లోబోలు పాల్గొన్నారు. మొదటి టాస్కులో మట్టి కలిపిన పేడలో ముత్యాలను కనిపెట్టాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ ముత్యాలను వెతికిపట్టుకుంటారో వాళ్లే విజేతలను చెప్పారు. అయితే పేడ వాసనకు ఇంటి సభ్యులు ముక్కు మూసుకుంటే… కాజల్ మాత్రం తనకు ఆ వాసన అంటే ఇష్టమంటూ ఓవర్ చేసింది.

ఇక టాస్క్ స్టార్ట్ కాగా.. పేడలో వెతికిన ముత్యాలను నీళ్లలో కడిగి పక్కన పెట్టాలి. అయితే ఇందులో లోబో కంటే షణ్ముఖ్ ముత్యాలను కనిపెట్టాడు.. అయితే షణ్ముఖ్ ముత్యాలు శుభ్రంగా లేవు.. కానీ లోబో తీసిన ముత్యాలు మాత్రం శుభ్రంగా ఉన్నాయి. దీంతో సంచాలకులుగా ఉన్న సన్నీ ఆలోచనలో పడ్డాడు. అయితే షణ్ముఖ్ ముత్యాలు సరిగ్గా లేవని విశ్వ, శ్రీరామ్, రవి అనగా.. శుభ్రంగా ఉండడం కాదు.. ఎక్కువ తీయాలంతే అంటూ షణ్ముఖ్‏కు సపోర్ట్ చేసింది సిరి. ఇక చివరకు సన్నీ.. షణ్ముఖ్ విజేత అని ప్రకటించగానే..సిరి ఎగిరి గంతేసి షణ్ముఖ్‏ను హగ్ చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement