Sunday, April 28, 2024

Vikarabad : ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రయాణికుడి దాడి.. 45 బస్సుల నిలిపివేత

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ బస్టాండ్‌లో ఓ ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆర్టీసీ డ్రైవర్‌పై ఆ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో బస్సులను డ్రైవర్లు నిలిపివేసి ఆందోళకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ రాములు.. టిఫిన్ చేసేందుకు వికారాబాద్ బస్టాండ్‌లో బస్సును నిలిపివేశాడు. బస్సులోనే కండక్టర్, డ్రైవర్ కలిసి టిఫిన్ చేసేందుకు సిద్ధమయ్యారు.

అదే సమయంలో నవాజ్ అనే ప్రయాణికుడు వచ్చి బస్సు ఆలస్యంపై ప్రశ్నించాడు. టిఫిన్ చేస్తున్నాం.. ఐదు నిమిషాల్లో బయల్దేరుతుందని డ్రైవర్.. ప్రయాణికుడికి చెప్పాడు. అవేమి వినిపించుకోని నవాజ్.. డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్లంతా కలిసి దాదాపు 45బస్సులను నిలిపేశారు. డ్రైవర్ రాములుపై దాడి చేసిన నవాజ్‌ను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నవాజ్‌పై ఆర్టీసీ అధికారులు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సుల నిలిపివేతతో పరిగి, తాండూరు, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement