Friday, May 3, 2024

Palamuru లో అరాచక శక్తులను వంద మీటర్ల గోతి తీసి పాతి పెడతాం… రేవంత్ రెడ్డి

మహబూబ్ నగర్, నవంబర్ 28 (ప్రభ న్యూస్): ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల బతుకులు మారాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని జిల్లాను అభివృద్ధి చేయాలన్న ఇక్కడ ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలని అందుకు కాంగ్రెస్ పార్టీ గెలవాలని టి పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి జనసభ యాత్రలో భాగంగా ఆయన మహబూబ్ నగర్ పట్టణంలోని గడియారం చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో ప్రజల నిర్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గౌరవంతో పెద్ద పోస్ట్ ఇచ్చిందని దాన్ని నిలబెట్టుకునేందుకు శాయ శక్తుల కృషి చేస్తున్నానని జిల్లా ప్రజలకు వివరించారు.

పాలమూరు జిల్లా ప్రజలు నాటిన మొక్కను నరికేందుకు సీఎం కేసీఆర్,కేటీఆర్, హరీష్ రావు తోపాటు జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ భుజాలపై గొడ్డళ్లు పెట్టుకొని తిరుగుతున్నారని మీరు నాటి నీరు పోసి పెద్దగా చేసిన మహా వృక్షాన్ని కాపాడుకునే బాధ్యత మీ పైనే ఉందని,అందుకు కాంగ్రెస్ పార్టీనీ ఆదరించి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని కోరారు.మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం అతని కుందని ఎన్నికల్లో 25 వేల పై చిలుకు మెజార్టీతో అతన్ని పాలమూరు జిల్లా ప్రజలు గెలిపించాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పాలమూరులో ఉన్న అరాచక శక్తులను 100 మీటర్ల గొయ్యి తవ్వి పాతి పెడతామని కార్యకర్తలకు ధైర్యం నింపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒబేదుల్లా కొత్వాల్,వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్, ఎన్.పి వెంకటేష్,మారేపల్లి సురేందర్ రెడ్డి,అమరేందర్ రాజు,రాఘవేంద్ర రాజు, ఆనంద్ కుమార్ గౌడ్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, బెనహర్, వివిధ విభాగాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement