Tuesday, May 21, 2024

గేమింగ్‌ రంగంలో జోష్‌… ఏటా 12 లక్షలు ఆర్జిస్తున్న భారత గేమర్లు

భారత్‌లో గేమింగ్‌ పరిశ్రమ గత రెండేళ్లలో గణనీయంగా వృద్ధి చెందింది. దాంతో పలువురు యువకులు గేమింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. ప్రొఫెషనల్‌ గేమర్లు ఏటా రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకూ ఆర్జిస్తున్నారు. గేమర్లు స్ట్రీమింగ్‌, కంటెంట్‌ క్రియేషన్‌ ద్వారా కూడా పెద్దమొత్తంలో రాబడి పొందుతున్నారు. భారత్‌ గేమింగ్‌ పరిస్ధితిపై ఇటీవల హెచ్‌పీ చేపట్టిన అధ్యయనంలో ఈ వృత్తిని సీరియస్‌గా తీసుకున్న వారిలో దాదాపు సగం మంది రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకూ ఏటా ఆర్జిస్తున్నారని వెల్లడైంది.

3500 మంది ఈ సర్వే పలుకరించగా వీరిలో 70 శాతం మంది పీసీ యూజర్లు కాగా, 30 శాతం మంది మొబైల్‌ గేమర్లు. ఇక వీరిలో 75 శాతం మంది పురుషులు, 25 శాతం మంది స్త్రీలుగా ఉన్నారు. గేమింగ్‌ మెరుగైన కెరీర్‌ ఎంపికగా పలువురు భావిస్తున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 2023లో భారత గేమర్లలో సగం మంది ఏటా రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకూ సంపాదిస్తున్నారు. స్పాన్సర్‌షిప్స్‌, ఈ-స్పోర్ట్స్‌ టోర్నమెంట్స్‌ పెరుగుదల వల్ల కూడా గేమింగ్‌ పరిశ్రమలోకి గణనీయంగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నదని ఈ అధ్యయనం వెల్‌గడించింది. మరోవైపు యువత పెద్దసంఖ్యలో గేమింగ్‌ను సీరియస్‌ కెరీర్‌గా ఎంచుకునే ట్రెండ్‌ పెరుగుతున్నదని తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement