Wednesday, May 1, 2024

ఘనంగా పద్మాదేవేందర్రెడ్డి జన్మదిన వేడుకలు

మెదక్ : మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జన్మదినంను పురస్కరించుకుని పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడుపాయల్లోని వనదుర్గాభవానీ సన్నిధిలో పద్మా దేవేందర్ రెడ్డి పేరున ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సార శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement