Thursday, May 16, 2024

హ్యాండ్ వాష్ తయారీలో విద్యార్థి ప్రతిభ..

నెల్లూరు, ప్రభాన్యూస్ : వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఈనెల 5వ తేదీ నెల్లూరు జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి గణితం మరియు సైన్స్ ఒలంపియాడ్ ప్రదర్శన కార్యక్రమంలో విద్యార్థి ప్రదర్శించిన సహజ వనమూలికలతో హ్యాండ్ వాష్ తయారీ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ గాంధీలు విద్యార్థిని సుస్మంత్ కుమార్ ను ఈ ప్రాజెక్టును తయారు చేసేందుకు ప్రోత్సహించిన అటువంటి ఉపాధ్యాయులు వెంకటరత్నంను అభినందించారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు మేడసాని సుబ్బారావు, కే.గాంధీ, ఎం.రవి బాబు, వెల్ఫేర్ అసిస్టెంట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement