Thursday, May 2, 2024

కలెక్టరేట్ ను ముట్టడించిన ఔట్‌ సోర్సింగ్ నర్సులు

వరంగల్ కలెక్టరేట్ ను ముట్టడించారు ఔట్ సోర్సింగ్ నర్సులు..తమను ఉద్యోగాల నుంచి తొలగించడం పట్ల ఆగ్రహంతో కలెక్టర్ ని ముట్టడించారు. కరోనా సమయంలో విధులు నిర్వహించిన తమను ఎలా తొలగిస్తారని ఆవేదన నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రుల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 89 మంది నర్సులు ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యసేవలందించామన్నారు. ఇప్పుడు తమను అకారణంగా విధుల నుంచి తొలగిస్తే..ఎలా బ్రతుకుతామని, తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కలెక్టరేట్‌ ముందు నర్సులు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇవాళ, రేపు కూడా విస్తారంగా వర్షాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement