Sunday, April 28, 2024

ఇవాళ, రేపు కూడా విస్తారంగా వర్షాలు..

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి..ఉత్తర ఒడిశా నుంచి ఇంటీరియర్‌ ఒడిశా వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద బుధవారం ఏర్పడిన ఉపరితల ద్రోణితోపాటు మంగళవారం ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీన పడటంతో రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. రాష్ట్రంలో ఇవాళ రేపు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో మరో 4 రోజులు భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. గురువారం ఉదయం 6 గంటల వరకు అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్‌లో 13 సెంటీమీటర్లు నమోదైంది. దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. కాగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆదిలాబాద్‌లోని పొచ్చెర జలపాతం పొంగిపొర్లుతున్నది.

ఇది కూడా చదవండి: పెట్రో మంటలు..మరోసారి పెరిగిన ధరలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement