Wednesday, May 15, 2024

పెట్రో మంటలు..మరోసారి పెరిగిన ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతునే ఉంది. లీటరు పెట్రోలుపై 35 పైసలు, డీజిల్‌ 9 పైసలు భారం మోపాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100.56, డీజిల్‌ ధర రూ.89.62కు చేరింది. ఇక కోల్‌కతాలో పెట్రోల్‌ ధర 39 పైసలు, డీజిల్‌ ధర 15 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోల్‌ ధర రూ.100.62, డీజిల్‌ ధర రూ.92.65కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.106.59, డీజిల్‌ రూ.97.18, చెన్నైలో పెట్రోల్‌ రూ.101.37, డీజిల్‌ రూ.94.15, హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.50కు, డీజిల్‌ ధర రూ.97.68కి చేరాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెట్రోల్‌ ధర రూ.108.88కి చేరింది. ప్రస్తుతం అక్కడ లీటర్‌ డీజిల్‌ ధర రూ.98.40గా ఉన్నది.

ఇన్నాళ్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మాత్రమే పెంచుతున్న కంపెనీలు తాజాగా.. సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను కూడా పెంచాయి. ఢిల్లీలో రూ.43.40గా కిలో సీఎన్‌జీ ధర రూ.44.30కి చేరింది. అదేవిధంగా గృహావసరాలకు వినియోగించే పీఎన్‌జీ ధరను ఎస్‌సీఎంకు రూ.29.66గా ఉన్నది. నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌లో కిలో సీఎన్‌జీ ధర రూ.49.98కి, పీఎన్‌జీ రూ.29.61కి చేరింది.

ఇది కూడా చదవండి: సినిమా పరిశ్రమకు ఏపీ సర్కారు షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement