Tuesday, May 7, 2024

Exclusive | కేసీఆర్​కే మా ఓటు.. ఓట్టేసి, తీర్మానం చేసిన ఆ పది గ్రామాల ప్రజలు!

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలోని పది గ్రామాల ప్రజలు తాము కేసీఆర్‌కే ఓటు వేస్తామని ఇవ్వాల (శనివారం) ఏకగ్రీవ తీర్మానం చేశారు. మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి, నడిమి తండా, వెనుక తండ, బోడగుట్ట తండా, మైసమ్మచూరు, రాజకన్‌పేట, వడ్డెరగూడెం, గుండితండా, దేవునిపల్లి గ్రామాల పంచాయతీల్లో కేసీఆర్‌కు ఓటేస్తామంటూ తీర్మానం చేశారు. మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత‌ నివాసంలో ఆమెను కలిసి సంబంధిత తీర్మాన ప్రతులను అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కేసీఆర్‌కు మాత్రమే ఓటేస్తామని తీర్మానం చేయడం అక్కడి ప్రజల నిబద్ధతకు నిదర్శనమి, ఇది ఎంతో అద్భుతమన్నారు. షబ్బీర్ అలీ వంటి కాంగ్రెస్ నేతలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్‌కు కామారెడ్డి ప్రజలు పట్టం కడతారని అన్నారు. కామారెడ్డిలోని అన్ని గ్రామాల ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకే కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని కవిత స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement