Tuesday, April 30, 2024

Old is Gold – మళ్లీ రాబోయేవి మట్టి రోజులే…. హ‌రీష్ రావు

సిద్ధిపేట : మళ్లీ రాబోయేవి మట్టి రోజులే. ఓల్డ్ ఇజ్ గోల్డ్. ట్రెండ్ మారుతున్నది. ప్రజలకు ఆరోగ్యం పై శ్రద్ధ పెరుగుతున్నది. మళ్లీ పాత రోజులు మట్టి పాత్రలు తిరిగి వస్తున్నాయని కుండలకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంటున్నదని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కేసీఆర్ నగర్ లో బీసీ కార్పోరేషన్ సౌజన్యంతో కుమ్మర మోడ్రన్ మెకనైజ్డ్ పాఠరి ఇండస్ట్రీ-కుమ్మరి కుల వృత్తులకు శిక్షణ కేంద్రంకు మాజీమంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఏంబీసీ కార్పోరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ మంజుల- రాజనర్సు, బీసీ కార్పోరేషన్ ఈడీ సరోజ, రాష్ట్ర కుమ్మరి సంఘ నాయకులు బాలకృష్ణ, జయంత్ రావు, జిల్లా అధ్యక్షుడు దర్పల్లి శ్రీనివాస్, ఇతర నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా మట్టి పాత్రలకు ఆదరణ పెరుగుతున్నది. ఒకప్పటి కుండలు పాతబడ్డ కుండలకు మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. కుండ బిర్యానీ స్పెషల్ అయ్యింది. డిమాండ్ పెరుగుతుంది. పాత సంప్రదాయం మళ్లీ వస్తున్నది. ప్లాస్టిక్ బదులుగా ఛాయ్ కోసం మట్టి కప్పులు వాడుతున్నారు.
రూ.5 కోట్ల విలువైన భూమి రూ.2.50 కోట్లతో ఈ పరిశ్రమ స్థాపించుకుంటున్నామని, టెక్నాలజీతో మట్టి పాత్రలు రూపొందించడమే ఈ పరిశ్రమ ధ్యేయమని, అందంగా వేగంగా చేసే మట్టి పాత్రలు తయారీ ఇండస్ట్రీ ద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది. ఈ కేంద్రంలో ఎవ్వరైనా శిక్షణ పొందవచ్చు. ప్రభుత్వ సహాయంతో ఇంట్లో తయారు చేసుకుని ఆర్థిక అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 400 మంది కుమ్మరులకు లక్ష సహాయం అందించామని సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి మీద ఆధారపడి పనిచేసే వారికి మేమే సొంతంగా మిషన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు కోరిక మేరకు తప్పనిసరిగా ఫంక్షన్ హాల్ కోసం మంజూరు ఇస్తాం. శాలివాహన చక్రవర్తి విగ్రహం తప్పనిసరిగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా. మంచి కూడలిలో ఏర్పాటు చేసుకుందాం. అప్పటి ఏంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఆలోచన అయితే, జిల్లా బీసీ కార్పోరేషన్ ఈడీ సరోజ ఆచరణతో యేడాదిన్నర శ్రమ తో ఇది సాధ్యమైందని వారిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు ” అంటూ ముగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement