Thursday, May 23, 2024

15 మంది నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 15 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి రవిగుప్త సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో గత పది రోజులుగా పెద్ద ఎత్తున బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకే జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన డిఎస్పీలను, అడిషనల్ ఎస్పీలను నాన్ క్యాడర్ ఎస్పీలను, స్వంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే రెండు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement