Wednesday, May 1, 2024

యాచారంలో పడకేసిన పారిశుద్ధ్యం

.యాచారం, జూలై 21(ప్రభన్యూస్): యాచారం మండలంలో గత రెండు వారాలుగా పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కార్మికుల సమ్మె వల్ల గ్రామాలలో పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిలిచిపోయాయి, ముఖ్యంగా యాచారం పట్టణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడంతో సాగర్ రహదారిపై చిరు వ్యాపారులు చెత్తను మొత్తం బస్తాలలో నింపి రోడ్డు డివైడర్ పైన వేస్తున్నారు.

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానముసురు దంచి కొడుతుండటంతో సంచులలో వేసిన చెత్త మొత్తం తడిసి సంచులలోనే మురిగిపోయే పరిస్థితి నెలకొంది. యాచారం పట్టణ కేంద్రంలో సాగర్ రహదారిపై నడుచుకుంటూ వెళ్లే వారికి కంపు వాసన భరించలేక పోతున్నారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు సజావుగా సాగేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement