Tuesday, April 30, 2024

ప్రజల సహకారంతో పంట నష్టాన్ని నివారించాం… సర్పంచ్ దేవగౌడ్

సిరికొండ, జులై 29 (ప్రభ న్యూస్): గత బుధవారం నుంచి ఎడతేరిపి లేకుండా రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ప్రజల సహకారంతో పంటనష్టాన్ని నివారించామని సిరికొండ మండలం గడ్కోల్ గ్రామ సర్పంచ్ రాచకొండ దేవగౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ… కప్పల వాగుపైన నిర్మించిన వంతెనపైన 8 పీట్ల ఎత్తులో ఉదృతంగా నీరు ప్రవహించిందన్నారు. గడ్కోల్ గ్రామానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా వీడీసీ సభ్యులు, గ్రామస్థుల సహకారంతో నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు దేవగౌడ్ తెలిపారు. గత 8 సంవత్సరాల నుంచి ఇంతటి భారీ వర్షాన్ని తాను చూడలేదన్నారు.

లోతట్టు ప్రాంతంలో నివాసమున్న 4 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు వీడీసీ చేర్మెన్ మామిడి రాములు సహకారంతో తరలించినట్లు అయన పేర్కొన్నారు. అంతే కాకుండా కప్పల వాగుపై నిర్మించిన చెక్ డ్యాం కోసం పోసిన కరకట్ట మట్టి పూర్తిగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు సర్పంచ్ తెలిపారు. రైతులు సాగు చేసిన మొక్కజొన్న, వరి, పసుపు తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సర్పంచ్ చెప్పారు. కప్పల వాగు వంతెన క్రింద నిలిచిన చెత్తను తొలగించి వంతెనకు నష్టం కలుగకుండా కొంత మేరకు కాపాడగలిగామన్నారు. అలాగే భారీ వర్షాలకు గ్రామంలో పెండ్లి చందర్, కమ్మరి లక్ష్మణ్, కమ్మరి రవి, మంచే పుష్పకు చెందిన నివాసపు ఇల్లు కూలినట్లు సర్పంచ్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement