Saturday, May 4, 2024

బ్యాంకు పేరుతో ఘరానా మోసం

  • పిగ్మి పేరుతో వ్యాపారస్తులను బురిడీ కొట్టించి డబ్బులు వసూలు చేసి డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేయని వైనం- డ్వాక్రా మహిళల వద్ద డబ్బులు తీసుకుని బ్యాంకులో వేస్తానని మోసం చేసిన దృశ్యం- ఖాతాదారుల నుండి లక్షల్లో బ్యాంకు పేరుతో డబ్బులు స్వాహా చేస్తున్నా బాధితులు ఫిర్యాదు చేసే వరకు మోసం పై పత్తా తెలియని బ్యాంకు అధికారులు- వర్ని కెనరా బ్యాంకులో సంఘటన

వర్ని, ఫిబ్రవరి 23 (ప్రభా న్యూస్):చిన్నచితక వ్యాపారులు రోజు తాము సంపాదించిన సంపాదన నుండి ఎంతో కొంత జమ చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసుకుంటూ ఉంటారు. వ్యాపారస్తులు రోజు బ్యాంకులో డబ్బులు జమ చేసుకుంటే తమ వ్యాపారం పై నమ్మకం కుదిరి ఏదో ఒక రోజు బ్యాంకు అధికారులు తమకు లోను మంజూరు చేస్తారని కొంత మంది వ్యాపారస్తులు బ్యాంకుల్లో రోజు డబ్బులు జమ చేస్తుంటారు. కానీ కెనరా బ్యాంక్ వర్ని లో ఎన్ ఎన్ డి (పిగ్మి) పేరుతో బ్యాంకు తరపున ఒక వ్యక్తి అటు వ్యాపారస్తుల నుండి, ఇటు డ్వాక్రా మహిళల సంఘాల నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి వారి ఖాతాలో జమ చేస్తానని చెప్పి డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయకుండా వ్యాపారస్తులకు, డ్వాక్రా మహిళలకు, బ్యాంకు అధికారుల కన్నుగప్పి డబ్బులు స్వాహా చేసిన సంఘటన వర్ని మండలంలో చోటుచేసుకుంది . విషయంలోకి వెళ్తే పిగ్మి పేరుతో ఒక వ్యక్తి ద్వారా వ్యాపారస్తులు రోజు కెనరా బ్యాంక్ వర్నిలో డబ్బులు జమ చేసుకుంటున్నారు. సదరు వ్యక్తి రోజు వ్యాపారస్తుల నుండి ఎన్ ఎన్ డి (పిగ్మి) పేరుతో రోజు డబ్బులు వసూలు చేస్తున్నాడు.

ప్రతినెల బ్యాంకు లోన్ డబ్బులు, జమ డబ్బులు కట్టడానికి వచ్చే మహిళా సంఘాల నుండి నేను కడతానని చెప్పి మహిళా సంఘాల వద్ద నుండి కూడా డబ్బులు తీసుకుని బ్యాంకులో డబ్బులు జమచెయ్యకుండా కాలం వెళ్ళదీస్తున్నాడు. దీంతో కొంతమందికి అనుమానం వచ్చి జమ డబ్బుల గురించి ఆరా తీయగా బ్యాంకులో తమ డబ్బులు జమ చేయడం లేదని తెలుసుకున్నారు. విషయంపై బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు చేసి 15 రోజులు గడిచినా విషయం గురించి ఎలాంటి స్పష్టమైన వివరణ ఖాతాదారులకు తెలియకపోవడంతో డబ్బులు వసూలు చేసే వ్యక్తి షాప్ ముందు బాదిత వ్యాపారస్తులు, డ్వాక్రా మహిళలు గురువారం ఆందోళనకు దిగారు.

ఎవరి డబ్బులు వారికి ఇచ్చేంతవరకు ఊరుకునేది లేదని అవసరమైతే సదరు వ్యక్తి షాప్ నుండి డబ్బులు ఇచ్చే వరకు సామాన్లు తీసుకెళ్తామని ఆందోళన చేసి ఎవరి డబ్బులు వారికి చెల్లించేంతవరకు ఊరుకునేది లేదని షాప్ కు తాళం వేశారు. విషయంపై బ్యాంకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత వ్యాపారస్తులు, డ్వాక్రా మహిళా సంఘాల మహిళలు బ్యాంక్ అధికారులను కోరారు.ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం- కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ రాఘవేంద్ర కుమార్ఎంత మంది డబ్బులు కట్టరో తెలుసుకొని వారి నుండి వివరాలు సేకరిస్తాం. విషయంపై విచారణ చేపట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement