Thursday, May 2, 2024

NZB: అవినీతిలో రాష్ట్రంలోనే అర్బన్ నెంబర్ వన్.. ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, నవంబర్ 13 (ప్రభ న్యూస్) : అవినీతిలో రాష్ట్రంలోనే నిజామాబాద్ అర్బన్ మొదటి స్థానంలో ఉందని.. అభివృద్ధి తక్కువ… అవినీతి ఎక్కువ అని బీజేపీ అర్బన్ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ ఆరో పించారు. కబ్జాలు, అక్రమాలు, బెదిరింపు రాజకీయాలతో నిజామాబాద్ అర్బన్ ని పూర్తిగా బ్రష్టు పట్టించిన ఘనత బిగాలకే చెల్లుతుందని ధ్వజమెత్తారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని ప్రాంతంలో గల ధన్పాల్ నివాసం వద్ద ఉత్కంఠత నెలకొంది. ఇచ్చిన టైం మాట ప్రకారం కంటేశ్వర్ చౌరస్తా వద్దకు 10గంటలకు ఇంటి నుంచి ధన్ పాల్ బయల్దేరుతుండగా… బహిరంగ చర్చకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు అందజేశారు. ఇవాళ మధ్యాహ్నం నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బహిరంగ చర్చకు రావాలని చెబితే.. బిగాల … నోటీసులు అడ్డం పెట్టుకొని తప్పించుకున్నామంటూ.. అవినీతి బండారం బాధితులే చేప్తున్నారన్నారు.

నోటీసులు అడ్డం పెట్టుకొనే సవాలుకు రాలేదా.. వచ్చేంత దైర్యం లేక రాలేదా అని ప్రశ్నించారు. నియోజక వర్గంలో కళాభారతి స్థలాన్ని ఎందుకు మార్చావో ప్రజలకు సమాధానం చెప్పాలని ధ్వజమెత్తారు. కళ్యాణ లక్ష్మి డబ్బులు ఎప్పుడు వస్తున్నాయో ప్రజలని అడుగుదామని తెలిపారు. కొత్త పెన్షన్ ఇప్పటికి ఇవ్వలేదన్నారు. నీ అవినీతి చిట్టా రోజుకు ఒకటి బయట పెడుతానని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న క్యాంపు ఆఫీస్ ను ఎందుకు వాడుకుంటున్నావ్ అని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు నిన్ను ఇంటికి పంపడం ఖాయమని, అండర్ గ్రౌండ్ పనులు పూర్తి చేయక ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. మళ్ళీ సవాలు విసురుతున్నా.. నీకు దమ్ముంటే నేను ఆధారాలతో వస్తాను నువ్వే ఎక్కడికి రమ్మంటావో చేప్పు నేనే వస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, అసంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలంరాజు, ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మి నారాయణ, కార్పొరేటర్లు పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, మాస్టర్ శంకర్, ఎర్రం సుదీర్, మెట్టు విజయ్, బంటు వైష్ణవి రాము, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, ఇల్లేందుల మమతా ప్రభాకర్, బీజేపీ నాయకులు మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

ఇద్దరు అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య సవాళ్లు..

- Advertisement -

బిజేపి V/s బిఆర్ఎస్ మధ్య పోటాపోటీ.. ఇద్దరు అభ్యర్థులకు పోలీసుల నోటీసులు..

నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు అభ్యర్థులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ సందర్భంగా అభ్యర్థులు బహిరంగ చర్చకు వెళితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న నేపథ్యంలో… బీజేపీ అర్బన్ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ, బీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి గణేష్ బిగాలకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇటీవల బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా విసిరిన సవాలును స్వీకరించిన బిజేపీ అభ్యర్థి దన్ పాల్ ఈనెల 13న కంటేశ్వర్ లో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ అభ్యర్ధి దన్ పాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కు సవాల్ విసిరారు. దీంతో పోలీసులు బహిరంగ చర్చకు వెళ్లొద్దంటూ.. ఇవాళ ఉదయం ధన్ పాల్ నివాసం వద్ద పోలీసులు ధన్ పాల్ కు నోటీసులు అందజేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ బిగాలకు కూడా పోలీసులు నోటీసులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement