Friday, May 17, 2024

తరుగు పేరిట రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం.. మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి

ఇందల్ వాయి, జులై 13 ప్రభ న్యూస్ : రాష్ట ప్రభుత్వం తరుగు పేరిట రైతులను నట్టేట ముంచుతుందని, రాష్ట ప్రభుత్వాన్ని మిల్లర్లు శాసించే స్థాయికి చేరుకున్నారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇంఛార్జి డాక్టర్ భూపతి రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన మండలంలోని మల్లాపూర్ గ్రామంలో అనారోగ్యం కారణంగా మృతిచెందిన వడ్ల రాజు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మృతుని భార్య వరలక్ష్మీ కి 5000 వేల ఆర్థిక సహాయం అందించారు. బాకరం నర్శవ్వ కుటుంబాన్ని సైతం పరామర్శించారు.

అనంతరం మల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి పంటకు ప్రభుత్వం 3వేల కోట్ల రూపాయలు మిల్లర్ల దగ్గర వసూల్ చేస్తున్నారని అందులో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వాటా ఎంత అని ప్రశ్నించారు. తరుగు పేరిట రైతులను నట్టేట ముంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికీ దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముక్కు పిండి మిల్లర్ల దగ్గర వసూల్ చేసి నయాపైసా చొప్పున నష్టపోయిన రైతులకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, కస్ప మోహన్, సయెంధర్, చిన్నయ్య, తదితులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement