Wednesday, May 1, 2024

Power war – 11గంటల కంటే ఎక్కువ విద్యుత్ ఇస్తే రాజీనామా చేస్తా – .. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రభన్యూస్, ప్రతినిధి / యాదాద్రి – తెలంగాణ ప్ర‌భుత్వం వ్యవసాయానికి 11 గంటల కంటే ఎక్కువగా విద్యుత్ ఇస్తే రాజీనామాకు సిద్ధమని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని
భువనగిరి మండలం బండ సోమారం గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను పరిశీలించి విద్యుత్ సరఫరా తీరును ఆపరేటర్ బాలనరసింహను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా ఎన్నారై అడిగిన ప్రశ్నకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిసి తెలియక చెప్పిన సమాధానాన్ని రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్రంలో ఉచిత విద్యుత్ 12 నుంచి 13 గంటలకు మించి సరఫరా జరగడం లేదని అన్నారు. విద్యుత్ సరఫరా లో మధ్య మధ్యలో కరెంటు కోతలు మినహాయిస్తే 12 గంటలకు మించి విద్యుత్ సరఫరా జరగడం లేదని అన్నారు.

కాగా, అంతకుముందు గ్రామంలో మహిళ సంఘాల సభ్యులకు కుట్టుమిషన్ లను అందజేశారు. ఈ సమావేశంలో పొత్నక్ ప్రమోద్ కుమార్, పంజాల రామాంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement