Thursday, May 2, 2024

NZB: సభాపతికి కోనాపూర్ గ్రామస్తుల మద్దతు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ గ్రామీణ మండలంలోని జేకే తాండా వాసులు, కోనాపూర్ గ్రామస్తులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈరోజు జేకే తాండా పెద్దలు, కోనాపూర్ గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు బాన్సువాడలోని నివాసంలో పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసారు. తమ తాండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడంతో పాటుగా తాండా వాసులకు అవసరమైన అన్ని రకాల పనుల కోసం కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పోచారం శ్రీనివాసరెడ్డికి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ తాండా వాసులు అందరూ కలిసి చేసిన తీర్మానం కాపీని పోచారంకు అందజేశారు. మారుమూల గ్రామమైన కోనాపూర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో అన్ని రంగాలుగా అభివృద్ధి చెందిందని, గ్రామానికి అవసరమైన అన్ని వసతులు, మౌళిక సదుపాయాలు సమకూర్చారని కొనియాడారు.

ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి రుణం తీర్చుకోలేనిది. వచ్చే ఎన్నికలో తమ గ్రామం మొత్తం పోచారం వెంట ఉంటామని గ్రామస్తులందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పేదల పట్ల ప్రేమ, సేవాభావం కలిగి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ కష్టసుఖాల్లో పాలు పంచుకునే పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా అవకాశం కల్పించిన BRS పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జేకే తాండా వాసులు, కోనాపూర్ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. గులాబీ జెండా తప్ప తమ తాండాల్లో, గ్రామాల్లో వేరే జెండాలకు అనుమతి లేదని, ఎన్నికల ప్రచారం కోసం వేరే పార్టీల అభ్యర్థులు తమ గ్రామానికి రావద్దని తాండా వాసులు, గ్రామస్తులు స్పష్టం చేశారు. జేకే తాండా పెద్దలు సంగ్యా నాయక్, జమ్లా కార్బారీ, బన్సిలాల్, జగ్రామ్, మూడ్ బన్సీ, సురేష్, రూప్ సింగ్ లు, కోనాపూర్ గ్రామం నుండి సర్పంచ్ రమణారావు, MPTC హనుమాండ్లు, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు, ఉప సర్పంచ్ సాయిలు, పూదరి లక్ష్మణ్, గూళ్ళ సాయిలు, నోరి గంగారాం లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement