Sunday, April 28, 2024

తెలంగాణ ప్రజల సమస్యలు పట్టని మోదీ

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : నరేంద్ర మోడీకి తెలంగాణ ప్రజల సమస్యలు పట్టవని కేవలం రాజకీయ ప్రయోజ నాలు తప్ప మరొకటి లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. శనివారం. భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్ కు వస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపకపోవడంతో ప్రధాన మోడీ పర్యటన నిర సిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ వద్ద మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినా దాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇచ్చి, వరంగల్ జిల్లా ఖాజీపేట ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అదేవిధంగా గిరిజన యూని వర్సిటీని, ఆర్టికల్చర్ యూని వర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పరని పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లా పసుపు బోర్డు ను ఎంపీ గెలిచిన ఐదు రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇందులో ఏ ఒక్క హామీని అమలు జరపకపోగా ప్రజలపై బారాలను వేస్తూ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఉద్యో గాల కల్పనలో విఫలమ య్యారని వాపోయారు. ప్రజల పైన భారాలు మోపటంతో పాటు వైశ్యామ్యాలను పెంచి మతోన్మాద విధానాలతో రాజకీ య లబ్ధి కోసం నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారని ఇచ్చిన హామీని అమలు చేసి మోడీ కి తెలంగాణ పర్యటనకు హక్కు లేదని విమర్శించారు. జిల్లా రైతాంగం ఎంతగానో ఎదురు చూసిన పసుపు బోర్డు ఏర్పా టు చేయకపోవడంతో పాటు మూసివేసిన ఎక్కడ పరిశ్రమల ను తెరిపించటానికి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఏ ఒక్కటి కి జాతీయ హోదా కల్పించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆయన అన్నా రు. ఈ కార్యక్రమం లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట రాము లు, నూర్జహాన్, సబ్బని లత, ఎం గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్, సుజాత మరియు నగర కమిటీ సభ్యులు మహేష్, కృష్ణ, వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement