Wednesday, May 1, 2024

NZB: తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ గా హరోన్ ఖాన్

నిజామాబాద్, మార్చి 12(ప్రభ న్యూస్): తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ గా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 13వ డివిజన్ కార్పొరేటర్ హారోన్ ఖాన్ ఎంపికయ్యారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల పలు కార్పొరేషన్ లకు కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నిజామాబాద్ నగరానికి చెందిన కార్పొరేటర్ హరొన్ ఖాన్ పిసిబీ బోర్డ్ మెంబర్ గా నియమించారు.

తన నియమకానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్ లకు ప్రతి ఒక్కరికీ హరోన్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని 13వ డివిజన్ నుంచి గడిచిన ఎన్నికల్లో ఎంఐఎం తరపున కార్పొరేటర్ గా గెలిచారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మొదటి కార్పొరేటర్ కావడంతో హారోన్ ఖాన్ కు కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించిందని 13వ డివిజన్ నాయకులు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement