Sunday, December 8, 2024

NZB: జాతీయ స్థాయి సీనియర్ హాకీ పోటీలకు జిల్లా క్రీడాకారులు..

నిజామాబాద్ స్పోర్ట్స్, మార్క్స్ 11 (ప్రభ న్యూస్) : వనపర్తి జిల్లాలో ఇటీవల నిర్వహించిన సీనియర్ ఉమెన్ హాకీ ఓపెన్ సెలక్షన్స్ లో జిల్లా నుండి 15 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, అందులో ప్రతిభ కనబరిచిన ముగ్గురు క్రీడాకారులు దార్ల ప్రీతి, మమత, శ్రీ చందనలు పూణేలో ఈనెల 13 నుండి 23 వరకు జరుగబోయే 14వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ లో వీరు పాల్గొంటారని నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు విశాఖ గంగారెడ్డి, సదమస్తుల రమణ లు తెలియజేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలో రాణించినట్లు జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఇచ్చే సర్టిఫికెట్స్ తో ప్రభుత్వ ఉద్యోగానికి 2% రిజర్వేషన్ కి సహాయపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. జాతీయస్థాయి ఎంపికైన క్రీడాకారులను ఉపాధ్యక్షులు టి విద్యాసాగర్ రెడ్డి , కోశాధికారి పింజ సురేందర్, సంఘ సభ్యులు జీవీ నరసింహారెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎండి ఆరిఫ్, ఎండి జావిద్, డి. చిన్నయ్య, రిటైర్డ్ హాకీ కోచ్ హర్షవర్ధన్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.అంజు, ఈసీ మెంబర్స్ నగేష్, సంతోష్ ఠాకూర్, సీనియర్ హాకీ క్రీడాకారులు జిమ్మి రవి, సుధీర్, కత్తి శ్రీనివాస్ ,నవనీత్, రాహుల్,సాయి తేజ వీరిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement