Saturday, April 27, 2024

NZB: జనాభా ప్రాతిపదికన బీసీలకు 50శాతం రిజర్వేషన్స్ కల్పించాలి

నిజామాబాద్, సెప్టెంబర్ 20 (ప్రభ న్యూస్) : జనాభా ప్రాతిపదికన బీసీలకు 50శాతం రిజర్వేషన్స్ కల్పించాలని బీసీవీఎస్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయమైనప్పటికీ మహిళా బిల్లును మహిళా బిల్లుగానే చూడాలి.. లేదంటే కులాల వారీగా జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ప్రతి ఒక్కరికీ జనాభా ప్రకారం సమానంగా రిజర్వేషన్ కల్పిస్తూ భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు 50శాతం రిజర్వేషన్స్ కల్పించాలని ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ అన్నారు.

బీసీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బుధవారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని స్థానిక ఉమెన్స్ కాలేజ్ నుండి కంటేశ్వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నవతె ప్రతాప్ మాట్లాడుతూ… బీసీలకు 50శాతం రిజర్వేషన్స్ కల్పించాలని, లేదంటే పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్ కార్యదర్శి వైశాచి సంతోష్, నగర అధ్యక్షులు, కార్యదర్శి వెంకట్, యాదవ్ ప్రసాద్, జిల్లా నాయకులు పరమేష్, చిన్న, సతీష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement