Sunday, May 19, 2024

పువ్వులు అమ్మోద్దంటూ దాడులు.. న్యాయం చేయాలన్న రైతులు

నిజామాబాద్ ప్రభ న్యూస్ : ఆరుగాలం పాటు శ్రమించి ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి చేనులో పెంచిన పువ్వులను విక్రయించకుండా దౌర్జన్యం చేస్తూ.. భయ భ్రాంతులకు గురి చేస్తున్న పూల వ్యాపారులపై చర్యలు తీసుకొని.. న్యాయం చేయాలని రైతులు కోరారు. పండించిన పంటనే కాకుండా చివరికి పూలు అమ్ముకునే రైతులను కూడా దళారులు వదిలి పెట్టడం లేదు అనడానికి నిజామాబాద్ నగరంలో జరిగిన ఈ ఘటన నిదర్శనం… నిజామాబాద్ లోని రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతం లో పువ్వులు అమ్మొద్దంటూ రైతులపై దళారి పూల వ్యాపారుల దౌర్జన్యం నశించాలని రైతులు మాట్లాడారు. మహారాష్ట్ర ఉమ్రి ప్రాంతంలో సొంత చేను లో ఆరుగాలం పాటు శ్రమించి పెంచిన పువ్వులను విక్రయించడానికి నిజామాబాద్ నగరానికి రైలు మార్గాన ప్రతిరోజు నిజామాబాద్ నగరానికి వస్తామని తెలిపారు.

కాగా కొందరు దళారులు, పూల వ్యాపారులు సిండికేట్ గా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొ న్నారు. గత మూడు రోజుల క్రితం రైల్వే స్టేషన్ ప్రాంతంలో పువ్వులు అమ్ముకునే రైతులపై.. పూల వ్యాపారులు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తు న్నారని ఆరోపించారు. దళారులను నమ్మకుండా నేరు గా కష్టపడి పెంచిన పువ్వు లను విక్రయించే హక్కు రైతుల కు లేదా అని పేర్కొన్నారు. పూల వ్యాపారుల దౌర్జన్యం ఏమిటని ప్రశ్నించారు. అంతేకా కుండా ట్రాఫిక్ పోలీసుల ద్వారా తమపై ఒత్తిడి తీసుకువస్తు న్నారని ఆరోపించారు. ఇప్పటి కైనా ప్రభుత్వం, పోలీసులు వెంటనే విచారణ చేపట్టి మాపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాం తులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని రైతులు కోరారు. పూల వ్యాపారుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement