Tuesday, April 30, 2024

బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి.. టీడీపీ ధ‌ర్నా..

నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వీల్‌ఛైర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని తమ తల్లిదండ్రులు నేలపై కాళ్లు ప‌ట్టుకుని లాక్కెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘ‌ట‌న చాలా బాధాకరమని, వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జి దెగాం యాదగౌడ్ తెలిపారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ‌ సుపత్రిలో సౌకర్యాలపై ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆసుపత్రి ఇన్ చార్జికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న‌ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సర్కారు దవాఖానాలో అన్ని సౌకర్యాలు కల్పిం చాలని టీడీపీ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement