Thursday, May 2, 2024

NZB: పోలింగ్ విధులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి… కలెక్టర్

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 31 (ప్రభ న్యూస్) : ప్రస్తుత శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 30న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలున్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫెలిసిటేషన్ సెంటర్లు, పీ.ఓలు, ఏ.పీ.ఓలకు అందిస్తున్న హ్యాండ్ బుక్, ఇతర పోలింగ్ సామాగ్రిని పరిశీలించి అందరికీ పంపిణీ జరిగేలా పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పీ.ఓలు, ఏ.పీ.ఓ లను ఉద్దేశించి కలెక్టర్ కీలక సూచనలు చేశారు.

శిక్షణ తరగతులను చక్కగా ఆకళింపు చేసుకుని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణమైన అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఇదివరకు ఎన్నికల విధులు నిర్వర్తించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు. మాక్ పోల్ నిర్వహించిన తరువాత తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ చేసుకోవాలని, పోలింగ్ ప్రారంభానికి ముందే ఈ.వీ.ఎం లను అన్నివిధాలుగా సరిచేసుకోవాలని హితవు పలికారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ ప్రక్రియ ఉదయం 7.00 గంటలకు ప్రారంభం కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పంపిణీ కేంద్రంలో కేటాయించిన ఈ.వీ.ఎంలను తీసుకొని నిర్దేశించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని, ఇతర వేరే ఏ ప్రాంతాలకు కూడా వెళ్లకూడదని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి సర్వీస్ ఓటరు కింద ఫారం-12D ఇవ్వడం జరుగుతుందని, మలివిడత శిక్షణ తరగతులకు హాజరయ్యే సమయంలో వాటిని అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ కె.రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement