Wednesday, May 15, 2024

Nizamabad- అభివృద్ధికే పట్టం కట్టండి – ఎమ్మెల్యే గణేష్ బిగాల

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)5: మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేస్తానని…నిజామాబాద్ నగరం అభివృద్ధి లో మరింత ముందుకు వెళ్లేందుకు,గడప గడపకు సంక్షేమం కొనసా గాలంటే బిఆర్ఎస్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని.. అర్బన్ ఎమ్మెల్యే , గణేష్ బిగాల కోరారు. నిజాంబాద్ అర్బన్ ప్రజలు ఆలోచించి అభి వృద్ధికి పట్టం కట్టండని కోరారు. నేను కూడా పెద్ద కాపునని వ్యవసాయ కుటుంభం నుంచి వచ్చానన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో గల ము న్నూరు కాపు కళ్యాణమం డపంలోనిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల వినా యక కళ్యాణ మండపంలో పాటి గల్లి మున్నూరు కాపు సంఘం, పంచముఖి మున్నూ రు కాపు సంఘం, జై కిసాన్ మున్నూరు కాపు సంఘం, హనుమాన్ నగర్ మున్నూరు కాపు సంఘం, నవోదయ మునూరు కాపు సంఘం, కోట గల్లి మైసమ్మ వీధి మునూరు కాపు సంఘం, సుగంధం తర్ప 7తర్ప ల ఆధ్వర్యంలో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమా నికి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

నిజామాబాద్ నగరం లోని ప్రతి మున్నూ రుకాపు సంఘానికి కమ్యూనిటీ హల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసామన్నారు. మున్నూరు కాపులకు రాజ కీయాల్లో వివిధ పదవుల్లో మున్నూరుకాపులను నీయ మించామన్నారు.నిజామాబాద్ నగరం 2014 లో ఏ విధంగా ఉంది ? ప్రస్తుతం ఎలా ఉంది ఒకసారి ఆలోచించాలని అన్నారు.2014 లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి? డ్రైనేజి లు ఎలా ఉన్నాయి? ఐటి హాబ్ ఉందా? మినీ ట్యాంక్ బండ్ ఉందా? సంక్షేమ పథకాలు ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆలోచించండని కోరారు. నిజా మాబాద్ నగరం లో ప్రధాన రోడ్లను విశాలంగా మార్చా మన్నారు. అంతర్గత రోడ్లను మెరుగుపరిచి ప్రతీ కాలనీ లో డ్రైనేజి నిర్మించామన్నారు.మన నిజామాబాద్ బిడ్డలకు ఉద్యో గాలు కావాలని ఐటి హాబ్ నిర్మాణం చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇచ్చామ న్నారు. నగర ప్రజలు ఆహ్లాద కరమైన వాతావరణం లో సేద తిరా డానికి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేసామని తెలిపా రు.

సంక్షేమం లో భాగంగా నిజామాబాద్ నగరం లో అర్హులైన వారికి 40 వేల మంది కి పింఛన్లు ఇస్తున్నా మన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా అడా బిడ్డల పెండ్లి ని ఘనంగా చేసి అత్తారింటికి పంపుతు న్నామన్నారు.బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 400 రూ.లకే వంట గ్యాస్ ఇస్తామన్నారు.అన్న పూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం ఇస్తామని,సౌభాగ్య లక్ష్మీ పథకం కింద నిరు పేద మహిళలకు 3000 రూ.ల జీవన భృతి ఇస్తున్నామ న్నారు.

- Advertisement -

అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాలను ఒక్కొతర్పనుంచి సంఘ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ మాజీ మేయర్ ఆకుల సు జాత ,సూదం రవి చందర్, కో అప్షన్ సభ్యులు దారం సాయిలు, కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్,బి.ఆర్.ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,ఆకుల శ్రీశైలం, గాండ్ల లింగం, పుప్పాల రవి,ఎర్రం గంగధర్, కులచారి సంతోష్, లడ్డు శంకర్, చింతకాయల రాజు, నర్సింగ్, అనిల్ పాటి గల్లి మున్నూరు కాపు సంఘం, పంచముఖి మున్నూరు కాపు సంఘం, జై కిసాన్ మున్నూరు కాపు సంఘం, హనుమాన్ నగర్ మున్నూరు కాపు సంఘం, నవోదయ మునూరు కాపు సంఘం, కోట గల్లి మైసమ్మ వీధి మునూరుకాపు సంఘం, సుగంధం తర్ప మున్నూరు కాపు సంఘం సభ్యులు
తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement