Thursday, May 16, 2024

Nizamabad – వైకుంఠ ఏకాదశి … ఆలయాల్లో ధన్పాల్ ప్రత్యేక పూజలు

నిజామాబాద్ సిటీ డిసెంబర్ (ప్రభ న్యూస్)23: వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురా రోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ స్వామి వారిని వేడుకున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
శనివారం నిజామాబాదు నగరం లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజాంబాద్ నగరంలోని పలు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు.

సుభా ష్ నగర్ లోని రామలయాన్ని, జెండా బాలాజీ దేవాలయాల ను అర్బన్ శాసనసభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ దర్శిం చుకున్నారు. ఈ సందర్బంగా దన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అర్బన్ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, కరోనా లాంటి మహమ్మారి ప్రభలకుండా పారద్రోలాలని ఆ వైకుంఠ ఏకాదశమి రోజు స్వామి వారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఈఓ తదితరులు పాల్గొన్నారు.

స్వామి శ్రద్ధానంద సేవలు మరువలేనివి…

స్వామి శ్రద్ధానంద భారత స్వాతంత్ర్య సమరయోధుడు… హిందూ మత సంస్కర్త. స్వామి దయానంద సరస్వతి ఆశయ ప్రచారము, వాటి సాధనే ధ్యేయంగా బ్రతికాడు. హిందూ మత సంఘటన, శుద్ధి ఉద్యమాలను విస్తృతంగా పరిచాడు…స్వామి శ్రద్ధానంద సేవలు మరువలేనివనీ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనా రాయణ అన్నారు. శనివారం నిజామాబాదు నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లోని శ్రదానంద్ గంజ్ లో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రదానంద్ బలి దానా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనస భ్యులు దన్పాల్ సూర్య నారాయణ హాజరై మాట్లా డుతూ స్వామి శ్రద్ధానంద అతను కాంగ్రీ గురుకుల విద్యాలయంతో సహా అనేక విద్యాలయాలను స్థాపించాడు. 1926వ సంవత్సరంలో ఒక మతోన్మాది చేతిలో హత్యకు గురయ్యాడు. ఆనాటి నుంచి బలిదానా దినంగా మన ఆర్య సమాజ్ కుటుంబ సభ్యులు చేసుకోవడం జరుగుతుంద న్నారు.

- Advertisement -

ప్రతి సంవత్సరం ఇదే విదంగా కార్యక్రమాలు నిర్వ హించాలని ఆర్యసమాజ్ కి ఎల్లప్పడు ఏ అవసరం ఉన్న అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆర్య సమాజ్ అధ్యక్షులు కరిపే సూర్యప్రకాష్, మార్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు లాభిషేట్టి శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బట్టికర్ ఆనంద్,పవన్ ముందడ, మఠం పవన్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement