Wednesday, May 8, 2024

అనుమతులు లేకపోయినా.. అనంతగిరి అడవిలో నైట్ క్యాంపింగ్

వికారాబాద్ టౌన్ (ప్రభ న్యూస్): అనంతగిరిలో నైట్ క్యాంపింగ్ పర్మిషన్​ లేకపోయినా కొంతమంది ఇష్టమున్నట్టు వ్యవహరిస్తున్నారు. పోలీస్ , ఫారెస్ట్ శాఖలు రెండూ 24 గంటలు అనంతగిరిలో పనిచేసినా ఆసాంఘిక కార్యక్రమాలు ఆగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పర్యాటకులు అడవి ప్రాంతంలో టెంట్లు వేసుకొని వుడ్ ఫైర్ పెట్టుకుంటున్నారు. దీనికి అక్కడ ఉన్న సిబ్బంది అలసత్వమా లేక.. మరేదైన కారణమా అన్నదానికి మాత్రం సమాధానం దొరకడం లేదు.

అనంతగిరి అడవీ ప్రాంతంలో క్యాంప్​ ఫైర్​ వంటి దృశ్యాలు చూసినవారు చాలా అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. నైట్ క్యాంపింగ్.. ట్రెక్కింగ్​ అనుమతులు లేకున్నా కొంతమంది అదే పనిగా ఇక్కడే మకాం వేస్తున్నారు. ట్రెక్కింగ్​కు అటవీ శాఖ అనుమతి కంపల్సరీ తీసుకోవాలి, కానీ.. కొందరు దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ హల్​చల్​ చేస్తున్నారు. రాత్రి సమయాల్లోె కారులో వస్తున్న యువకులు పెద్ద పెద్ద సౌండ్స్​తో పాటలు వింటూ హంగామా చేస్తున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేస్తేనే అడవిలో ఉన్న మూగజీవాలకు ఇబ్బందికరంగా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement