Wednesday, May 15, 2024

డేటా చోరి కేసు ఎన్ ఐ ఎ చేతికి…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: డాటా చోరీ కేసులో హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పోలీసులు దూకుడు పెంచారు. దేశ జనాభాలో సగం మంది వ్యక్తి గత సమాచారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చివరికి పెళ్లి సంబంధాలను కుదిర్చే మ్యాట్రిమోనీ సంస్థలు సేకరించిన వివరాలు అంగట్లో ఉండడంతో ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మంకంగా తీసుకుని దర్యాప్తు చేస్తోంది. కీలకమైన రక్షణ శాఖ వివరాలతో దేశ సరిహద్దుల్లో సాగుతున్న నిఘా, త్రివిధ దళాల సమాచారం బయటకు పొక్కడంతో కేంద్ర నిఘా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ప్రధాని కార్యాలయంలో రక్షణ శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న పలువురు ఉన్నతాధికారులు సైబరాబాద్‌ పోలీసులతో సంప్రదింపులు జరిపి ఎటు-వంటి సమాచారం నిందితులు చోరీ చేసిందన్న అంశంపై ఆరా తీసినట్టు- సమాచారం. కొందరు ఆర్మీ, నేవీ, పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు వరుసగా మూడు రోజులపాటు- సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, డాటా చోరీ కేసును ఛేదించి విచారణ జరుపుతున్న సైబర్‌ -కై-ం ఉన్నతాధికారి కల్మేశ్వర్‌ సింగన్‌ వార్‌ను కలిసి పూర్తి సమాచారాన్ని సేకరించినట్టు- సమాచారం. మరోవైపు డాటా చోరీ అంశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కూడా దృష్టి సారించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున నిధులు చేతులు మారి ఉంటాయని భావిస్తున్న ఈడీ అధికారులు సైబరాబాద్‌ పోలీసులు జరిపిన విచారణ వివరాలను సేకరిస్తున్నట్టు- సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల బ్యాంక్‌ ఖాతాలను పరిశీలిస్తున్నట్టు- తెలుస్తోంది. ఉగ్రవాదులు, మతఛాందసవాదుల నుంచి హవాలా రూపంలో నిధులు వచ్చి ఉంటాయన్న అనుమానంతో ఆ దిశగా విచారణ చేస్తున్నట్టు- సమాచారం.

25 కంపెనీలకు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు
డాటా చోరీ కేసులో సైబరాబాద్‌ పోలీసులు ఆదివారం 25 కంపెనీలకు నోటీ-సులు జారీ చేశారు. 160, 91 సీఆర్పీసీ కింద స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీతో సహా మరో ఐదు బ్యాంకులు, -టె-క్‌ మహేంద్ర, ఫోన్‌ పే, గూగుల్‌ పే, అమెజాన్‌, పేటీ-ఎం, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు- పేరొందిన ఆర్థిక సంస్థలు, ఐటీ- కంపెనీలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, ఈ-కామర్స్‌, ఈ-లెర్నింగ్‌ సంస్థలున్నాయి. వినియోగదారుల డాటాకు సంబంధించి వివరణ ఇవ్వాలని నోటీ-సులో పేర్కొన్నట్టు- సమాచారం. చోరీకి గురైన డాటా సంఘ విద్రోహ శక్తులకు చేరి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలను విమానశ్రయాలను, ఓడ రేవులను, రక్షణ శాఖ ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఉగ్రవాదులు, తీవ్రవాదులకు సమాచారం లీకై-తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటు-ందని భావిస్తున్న పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు.

కాగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నేరగాళ్లు పౌరుల వ్యక్తిగత డాటా చౌర్యానికి పాల్పడుతూ రూ.కోట్లు- కొల్లగొడుతున్నట్టు- సైబరాబాద్‌ పోలీసుల విచారణలో బయటపడింది. 16.8 కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డాటా చోరీ కేసు మరువకముందే తాజాగా మరో సంచలన సమాచారం బయటకు రావడంతో దర్యాప్తు సంస్థలన్నీ ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు రంగప్రవేశం చేస్తున్నట్టు- సమాచారం. ఏకంగా 66.9 కోట్ల మందికి చెందిన డాటాను ఢిల్లీకి చెందిన వినయ్‌ భరద్వాజ్‌ దర్జాగా విక్రయిస్తున్నాడని తేలడంతో అందులో ఎటు-వంటి సమాచారం ఉంది..? ఇప్పటికే డాటా వివరాలను ఎవరి-కై-నా చేరవేశాడా..? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు- సమాచారం. అమర్‌ సొహైల్‌, మదన్‌ గోపాల్‌ నుంచి డాటా కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరగాళ్లతో పాటు- ఇతర వ్యాపార ప్రకటనలు అవసరమున్న వారికి అమ్ముతున్నాడని నిర్ధారణ కావడంతో ఆ వివరాలను రాబడుతున్నారు. ఫరీదాబాద్‌ కేంద్రంగా 8 నెలలుగా ఈ దందా సాగిస్తున్నట్టు- పోలీసుల విచారణలో బయటపడిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు- రంగ సంస్థలకు చెందిన రహస్య, సున్నిత సమాచారం ఉన్నట్టు- పోలీసులు చెప్పడంతో సైబర్‌ నేరగాళ్లు వివిధ బ్యాంక్‌ ఖాతాదారుల నుంచి నిధులు కొట్టేశారా..? వివిధ రాష్ట్రాల్లో సైబర్‌ -కై-ం పోలీసులు బ్యాంక్‌ అక్రమాలకు సంబంధించి నమోదు చేసిన కేసుల వివరాలు తెప్పించి ఆ దిశగా కేసు విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు- సమాచారం.

చోరీ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌
దేశవ్యాప్తంగా జీఎస్టీ చెల్లింపులు, ఆర్టీవోలో నమోదైన వ్యక్తులు, అమెజాన్‌, నెట్‌ప్లిnక్స్‌, బిగ్‌ బాస్కెట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, జొమాటో, పాలసీ బజార్‌ వినియోగదారుల వివరాలు లభించాయి. హర్యానాలో ఫరీదాబాద్‌ కేంద్రంగా క్లౌడ్‌ డ్రైవ్‌ లింకుల ద్వారా సమాచారం విక్రయిస్తున్నాడని, డాటా విక్రయించేందుకు ”ఇన్‌స్పైర్‌ వెబ్స్‌” పేరుతో వెబ్‌సైట్‌ సృష్టించిన వైనాన్ని పోలీసలు శోధిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఏ విభాగం ప్రజల డాటా అవసరమో తెలుసుకుని దాని ధర నిర్ణయించి విక్రయిస్తున్నట్టు- తెలియడంతో తెలుగు రాష్ట్రాలకు అందిన సమాచారంపై ఆరా తీస్తున్నారు.

- Advertisement -

హైదరాబాద్‌కు చెందిన 55 లక్షల మంది డాటా చోరీ
హైదరాబాద్‌ జంటనగరాల మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉంటు-న్న 55 లక్షల మంది వ్యక్తిగత సమాచారం చోరీకి గురికావడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండున్నర కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటా దొరకడంతో రెండు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2 కోట్ల పది లక్షల మంది, హైదరాబాద్‌కు చెందిన 55 లక్షల మంది డాటా నిందితుడి వద్ద పోలీసులు కనుగొన్న విషయం తెలిసిందే. యూపీకి చెందిన 21 కోట్ల మంది, నాలుగున్నర కోట్ల మహారాష్ట్రవాసుల సమాచారం వినయ్‌ భరద్వాజ వద్ద లభించింది.

ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు-
నిందితుడు ”ఇన్‌స్పైర్‌ వెబ్స్‌” వెబ్‌సైట్‌ ద్వారా పది వేల మంది ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల డాటాను రెండున్నర వేలకు, 50 వేల మంది ఫేస్‌బుక్‌ ఫాలోవర్ల డేటాను రూ.15 వేలకు విక్రయించాడు. డబ్బు చెల్లించగానే డాటా వచ్చేలా పకడ్బందీ వ్యవస్థ రూపొందించాడు. సమస్యలుంటే సంప్రదించేందుకు ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు- చేశాడు. వివరాలు బయటపడకుండా వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నాడు. ప్రచారం కోసం సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఏర్పాటు- చేసుకున్నాడు.

నిందితుడి దగ్గర ఎలాంటి సమాచారం ఉంది?
పేరు, మొబైల్‌ నెంబర్‌, పిన్‌కోడ్‌, నగరం, ఈ మెయిల్‌ ఐడీ, చిరునామా, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వృత్తి, పేటీ-ఎం ఖాతాదారుల వివరాలు, జీఎస్టీ కట్టే వ్యక్తుల వార్షికాదాయం, వాహనదారుల డాటా వంటివి నిందితుడి వద్ద ఉన్నట్టు- పోలీసులు గుర్తించారు. డాటా లీక్‌ కావడానికి వాటిని సేకరించే సంస్థల వైఫల్యమే కారణమని.. వారికి నోటీ-సులిచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో.. ఈ కేసులో మరిన్ని సెక్షన్‌లు నమోదు చేసే అవకాశం ఉంది. వ్యక్తిగత సమాచారం చౌర్యం కేసును తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement