Monday, April 29, 2024

NCP Demand – ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలను అరికట్టాలి..

నిజామాబాద్ సిటీ, జనవరి (ప్రభ న్యూస్)16: నిజామాబాద్ నగరంలో ప్రైవే ట్ ఆసుపత్రి నిర్వహకులు ఇష్టా రాజ్యంగా వ్యవహరించడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్ప డి ఆసుపత్రికి వచ్చే రోగులు, నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్రాఫిక్ నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేషనలిస్టు కాంగ్రె స్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాదవ్ మునిసిపల్ కమిషనర్ మకరం ద్ ని కోరారు. నిజామాబాద్ నగరం లోని మున్సిపల్ కార్యాలయం లో పార్కింగ్ కు స్థలం లేకున్నా పెద్దపెద్ద భవనాలు నిర్మించి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడడం పై నేషనలిస్టు కాంగ్రె స్ పార్టీ తెలంగాణ ఆధ్వ ర్యం లో నాయకులు ముని సిపల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రం అంద జేసి మాట్లాడారు. నిజామాబా ద్ నగరంలోని ఖలీల్వా డి, చుట్టుపక్కల ప్రాంతాల్లో విచ్చ లవిడిగా నిబంధనలు పాటిం చకుండా ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు బహుళ అంత స్తుల మేడలను నిర్మిస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యంగా సెట్ బ్యాక్, నిబంధనలు పాటించ కుండా ప్రవేట్ ఆసుపత్రుల వారు ఇష్టారాజ్యంగా వ్యవహ రించడంతో ట్రాఫీక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని మండిపడ్డారు. తీవ్ర అస్వస్థ తకు గురై , రోడ్డు ప్రమాదంలో గురైనప్పుడు గానీ, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం నిజా మాబాద్ నగరంలోని ఖలీల్ వాడి ప్రాంతానికి వస్తే అంతే సంగతులు… వైద్యం కోసం వచ్చే రోగులు అంబులెన్స్ లో ఇతర వాహనాల్లో వచ్చి నప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కొని గాల్లోనే ప్రాణాలు పోతున్నా యని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధి కారులు చర్యలు ఎందుకు తీసు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖలీల్వాడిలో ప్రవేట్ ఆసుపత్రుల ఆగడాలను అరికట్టి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలోఎన్ సిపి రాష్ట్ర మైనా రిటీ అధ్యక్షురాలు అక్తిరిబేగం, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మహ మూద్ పాషా, జిల్లా అధ్యక్షులు సయ్యద్ గౌస్, మైనార్టీ నిజా మాబాద్ వర్కింగ్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అలీమ్, నగర అధ్యక్షురాలునసీం ఫాతిమా, కౌసర్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement