Sunday, April 28, 2024

TS : ప్ర‌కృతి పండుగ హోలీ… ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు…

నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ రంగులతో జరుపుకునే ప్రకృతి పండుగ హోలీ అని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

హోలీ పండుగ భారతీయ సామాజిక సాంస్కృతిక జీవన ప్రత్యేకతను చాటుతుందని కేసీఆర్ అన్నారు.
వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హోలీ పర్వదిన సందర్భంగా ఆ ప్రకృతీమాత ప్రజలందరినీ చల్లగా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement