Thursday, April 25, 2024

Delhi : పండుగ పూట ఢిల్లీలో అగ్ని ప్రమాదం..

ఢిల్లీ లోని అలీపూర్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ లో ఈ ఉదయం భారీ ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో 34 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

అయితే ఈ ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీగా పొగ వ్యాపించింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణమేమిటో ఇంకా తెలియలేదు. దీంతోపాటు ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఏదైనా ప్రాణనష్టం జరిగిందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement