Friday, April 26, 2024

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు

రాజాపేట : తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ వ్యవస్థకే శాశ్వత పరిష్కారం చూపాడని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. మంగళవారం సీఎం కేసీఆర్ ను కలసి పుష్పగుచ్చాన్ని అందజేసి యావత్ నిరుద్యోగులు, విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తుంగ బాలు మాట్లాడుతూ… నిరుద్యోగులంతా కేసీఆర్ కు రుణపడి ఉంటారన్నారు. ప్రభుత్వ ఉద్యోగ భర్తీ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కల సాకారమైందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఒక్కొక్క అంశంలో సంపూర్ణంగా ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో లక్షల ఎకరాల భూమికి సాగునీటితో పాటు మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ త్రాగునీటిని సరఫరా చేస్తున్నారని గుర్తు చేశారు. నిధులను సంపూర్ణంగా ప్రజల అభివృద్ధికి ఖర్చు పెడుతున్నారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక నూతన పథకాలకు రూపకల్పన చేసి దేశంలోనే నెంబర్ వన్ గా రాష్ట్రాన్ని నిలిపిన ఘనతను కేసీఆర్ సొంతం చేసుకున్నారని ప్రశంసించారు. ఇప్పటికే దాదాపు లక్షా ముప్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా, మరో తొంభైవేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులంతా టీఆర్ఎస్ వెంటే నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement