Sunday, May 19, 2024

ఎవరికి వారే యమునా తీరే

**- సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పడుతున్న ఫిర్యాదుదారులు*

*బాధితులకు భరోసా ఇవ్వని సిబ్బంది*

*-ఆ ఫిర్యాదుతో నాకు సంబంధం లేదు : పట్టణ పోలీస్ కానిస్టేబుల్ అభిషేక్ విచిత్ర దోరణి*

సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ వ్యవహారం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. పోలీస్ ఉద్యోగుల విచిత్ర ధోరణితో ఫిర్యాదుదారులు ఇబ్బందులు పడుతున్నారు. కింది స్థాయి ఉద్యోగి నుండి పై స్థాయి ఉద్యోగి వరకు సెటిల్మెంట్లకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదుదారులను ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా లా అండ్ ఆర్డర్ ను గాలికి వదిలేశారని పిర్యాదు దారులు ఆరోపిస్తున్నారు.*ఫిర్యాదులకు స్పందన లేదు- బాధితులకు భరోసా లేదు* మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు వేములపల్లి మండలం బుగ్గ బాయ్ గూడెం గ్రామానికి వెళ్తున్న మహిళ ఇద్దరు కొడుకులను సోమవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయం గేటుకు అతి సమీపంలో కొంతమంది ఇందిరమ్మ కాలనీకి చెందిన వ్యక్తులు ఊహించని విధంగా దాడి చేశారు. తమ బంధు అంత్యక్రియలకు వెళ్తున్నామని ఎందుకు కొడుతున్నారో చెప్పాలని ఆ మహిళ వారిని కాళ్ళ వేల్లబడి ప్రాధేయపడిన ఆమెపై విచక్షణ రహితంగా వ్యవహరించి కొడుతున్న విషయాన్ని కొంతమంది స్థానికులు గుర్తించి దాడి చేసిన వ్యక్తులలో ఒకరిని పట్టణ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా డ్యూటీలో ఉన్న ఆఫీసర్ గాయాలు కలిగిన వారు చికిత్స తీసుకొని ఉదయం 10 గంటలకు స్టేషన్కు రావాలని చెప్పారు. తన కొడుకుకు విరిగిన చేయికి కట్టు కట్టించుకుని బాధిత మహిళ ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్కు వెళ్లి రిసెప్షన్లో ఉన్న ఆఫీసర్ను తమ ఫిర్యాదు పై వాకబు చేసింది గొడవ జరిగిన ఏరియా అభిషేక్ పరిధిలో వస్తుందని ఆయనను కలవాలని రిసెప్షన్ సూచించారు. దీంతో బాధిత కలిసి తమపై జరిగిన దాడి గురించి చెప్పగా… తనకు మీరు ఫిర్యాదు ఇవ్వలేదని, ఫిర్యాదు ఇస్తే మీ విషయం వింటానని బదులివ్వడంతో.. నిన్న రాత్రి స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి వెళ్ళామని మహిళ బదులు ఇవ్వగా.. ఆ పిటిషన్ తో నాకు సంబంధం లేదు. నాకు కొత్తగా ఫిర్యాదు రాసి ఇవ్వాలని ఆయన గద్దించడంతో తమకు న్యాయం చేసే ఉద్దేశం లేకనే దెబ్బలు తిన్న తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బాధిత మహిళ ఏడుస్తూ ఇంటికి చేరింది.*సెటిల్మెంట్ చేసుకొండి*పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసి రెండు రోజులు దాటినా దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తీసుకు రాకుండా ఇందిరమ్మ కాలనీ లీడర్ కు పిటిషన్ తరపున వచ్చిన వ్యక్తి నెంబర్ ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని సదరు కానిస్టేబుల్ పురమాయించాడు. దీంతో దాడి చేసిన వ్యక్తుల తరఫున ఒక వ్యక్తి గాయపడిన వారికి ఫోన్ చేసి జరిగిందేదో సెటిల్మెంట్ చేసుకుందామని ఫోన్ చేయడం పోలీస్ ల పని తీరు కు అద్దం పడుతుంది.*ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి*జిల్లా కేంద్రంలో అన్ని పోలీస్ స్టేషన్ లకు రోల్ మోడల్ గా ఉండాల్సిన పోలీస్ స్టేషన్ లో ఉద్యోగుల విచిత్ర దోరణి తో అభాసు పాలవుతుంది. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు బరోసా లభించేలా సిబ్బంది తీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement