Thursday, May 2, 2024

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో షాపు దగ్ధం.. రూ.5 లక్షల ఆస్తి నష్టం

మోత్కూర్, జులై 26 (ప్రభ న్యూస్) : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో చెరువుకట్ట వద్ద జనరల్ స్టోర్ లో ఈ ఉదయం షాపు యజమాని సుగురు సురేష్ షాపు తెరిచి ఉండగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో యజమాని రోడ్డుపైకి వచ్చాడు. ఇంతలోనే మంటలు తీవ్రం కావడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది అగ్నిమాపక వాహనంతో చేరుకొని సుమారు గంటపాటు దుకాణంలో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

దుకాణంలోని ఫర్నిచర్, ఫ్రిడ్జ్ ,ర్యాక్స్, పుస్తకాలు, సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో రూ.5లక్షల నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని సురేష్ విలేకరులకు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించినప్పటికీ దుకాణంలో వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. టపాకాయల పేలుళ్లు కారణమా ?… అనేది తెలియడం లేదు. ఇదే జనరల్ స్టోర్ లో దీపావళి దసరా పండుగ సందర్భంగా దుకాణ యజమాని టపాకాయలు క్రాకర్స్ అమ్ముతారని అవి దుకాణంలో స్టాక్ ఉండడంతో మంటలు చెలరేగి షాప్ దగ్ధం అయిందని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారణ చేస్తే షాప్ దగ్ధం కావడానికి జరిగిన కారణాలు తెలిసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement