Sunday, April 28, 2024

KNL: ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

ఆళ్లగడ్డ, ప్రభ న్యూస్: ఆళ్లగడ్డ ఏవీ గోడన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే… సడన్ గా హైవే పైకి వచ్చిన ఓ లారీని హైదరాబాద్ నుండి కడపకు వెళ్తున్న ఆల్విన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆల్విన్ డ్రైవర్ పెద్ద అంకాలు అక్కడికక్కడే చెందాడు. మరో డ్రైవర్ రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement