Monday, April 29, 2024

నాగార్జున సాగర్ జ‌లాశ‌యానికి పోటెత్తిన వ‌ర‌ద‌.. ఆరు గేట్లు ఎత్తివేత

ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా నాగార్జునసాగర్ జ‌లాశ‌యానికి వరద ప్రవాహం కొనసాగతున్నది. శ్రీశైలం నుంచి 66,089 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 6 క్రస్ట్ గేట్లను ఐదడుగుల మేర ఎత్తి 48,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతోపాటు కుడి, ఎడమ కాలువలు, విద్యుదుత్పత్తి ద్వారా మొత్తం 88,337 క్యూసెక్కులు బయటకు వెళ్లున్నది. కాగా, సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం నీటిమట్టం గరిష్ఠానికి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ఇప్పుడు 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement