Sunday, May 19, 2024

Nalgonda | అనాధగా అంగట్లో వృద్ధురాలి శవం.. అంత్యక్రియలు జరిపించిన పద్మశాలి సంఘము

మోత్కూర్, (ప్రభ న్యూస్) : ప్రభుత్వాలు… పాలకులు మారుతున్నా… నిరుపేదల సంక్షేమం పట్టడం లేదు.. నిలువ నీడ లేక.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఓ నిరుపేద వృద్ధురాలు కుర్రె రాధమ్మ మరణం దీన స్థితి చూస్తే.. హృదయ విచారకరం. కుర్రె రాధమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందగా, కిరాయి ఇంట్లో నివాసం ఉన్న ఆ కుటుంబం వృద్ధురాలు సోమవారం తెల్లవారుజామున మరణించడంతో నిలువ నీడలేక.. ఆ శవాన్ని అంగడి సంతలో వేసి.. స్థానిక పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించగా, ‘‘మన మోత్కూర్’’ వాట్సప్ గ్రూప్ దాతలు స్పందించి గంటల వ్యవధిలోనే సుమారు రూ.55 వేలు విరాళాల రూపంలో సేకరించారు.

మృతురాలు రాధమ్మ భర్త సత్తయ్య అనారోగ్యంతో గత 2 ఏండ్ల క్రితం మృతిచెందగా, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో విరాళాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రాధమ్మ, సత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఓ కుమారుడు పెళ్లి చేసుకొని హైదరాబాద్ వెళ్లి అక్కడే స్థిరపడ‌గా, కనీసం తండ్రి చనిపోతే కూడా రాలేదని పలువురు వాపోయారు. ఆ వృద్ధురాలితో ఉన్న పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు సైతం అనారోగ్యంతో బాధపడుతూ అంగ వికలాంగుడిగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ప్రభుత్వం నివాస స్థలంతో పాటు, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement