Thursday, May 16, 2024

Murder Conspiracy – కొత్త హ‌త్యాయ‌త్నం వెనుక కుట్ర కోణం – స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపిస్తామ‌న్న హరీష్ రావు

హైద‌రాబాద్ – ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ దాడి అత్యంత గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్త‌ను హ‌రీష్ రావు ప‌రామ‌ర్శించారు..

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ నిందితుడు కత్తితో దాడి చేయడంతో కడుపులో గాయాలైనట్లు చెప్పారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ కేడర్ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ అధైర్యపడవద్దన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హరీశ్ రావు అన్నారు. హత్యాయత్నం వెనుక రాజకీయ కుట్ర ఏదైనా ఉందా? అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement