Thursday, May 16, 2024

NZB: కౌశిక్ రెడ్డిపై ముదిరాజుల గరంగరం.. బర్తరఫ్ చేయాలని డిమాండ్

నిజామాబాద్ సిటీ, జూన్ 24 (ప్రభ న్యూస్) : ముదిరాజులను కులం పేరుతో దూషించిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఖబర్దార్ అని.. వెంటనే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు యాసడి నర్సింగ్ అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలోని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజ్ కులస్తులను అవమాన పరుస్తూ కులంపేరుతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముదిరాజులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా చేసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను ముదిరాజ్ కులస్తులు దగ్ధం చేసి మాట్లాడారు.

ఈనెల 22న హుజురాబాద్ నియోజకవర్గంలో మున్సిపల్ సిబ్బంది అమరవీరుల స్తూపం కూల్చివేత సందర్భంగా ఒక మహిళ ఎమ్మెల్సీ కోశిక్ రెడ్డితో సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపిస్తుండగా.. అక్కడే ఉన్న ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ ముదిరాజ్ కులస్తుడు అక్కడ విషయాలు వీడియో తీస్తుండగా ఇది గమనించిన ఎమ్మెల్సీ.. కెమెరా ని లాక్కోవడంతో పాటు అతన్ని కులం పేరుతో దూషించి బెదిరించారని ఆరోపించారు. అక్కడ ఏం జరిగినా కానీ ముదిరాజులను కులంపేరుతో దూషించడాన్ని ముదిరాజ్ కులస్తులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని, వెంటనే ముదిరాజులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 52 లక్షల ముదిరాజులు ఏకతాటిపైకి వచ్చి ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్ కుమార్, ముదిరాజులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement