Sunday, April 28, 2024

Modi – నేడే క‌మ‌ల దండోరా…వ‌ర్గీక‌ర‌ణ‌పై మాదిగ‌ల కోటి ఆశ‌లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దశాబ్దాలుగా సాగుతున్న పోరాట మది… రిజర్వేషన్లలోనూ తమకు తీరని అన్యాయం జరుగు తోందని నెత్తినోరు కొట్టుకుని ఎలుగెత్తి పొలికేక పెట్టి దండోరా మోగిస్తున్నా ఇంకా మోక్షం లభించలేదు… ఎట్టకేలకు వారి ఉద్య మానికి, అస్తిత్వానికి, ఆకాంక్షలకు, ఆశయాలకు, ఆశలకు సార్ధకం లభించనున్నది! మాదిగల ఉద్యమ సారధి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ విశ్వరూప గర్జన మహాసభ నేడు జరుగ నున్నది. ఇదే సభలో ప్రధానమంత్రి ప్రధాన మంత్రి మోడీ పాల్గొంటున్నారు. దీంతో వర్గీకరణ సమస్యకు తెరపడనున్నదని భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో వర్గీకరణకు అను కూలంగా బిల్లు పాస్‌ చేశారు. అయితే, దీనిపై సర్వోన్నత న్యాయ స్థానంలో వ్యతిరేక తీర్పు వచ్చింది. అయిదుగురు న్యాయ మూర్తుల ధర్మాసనం తీర్పు ఇస్తూ పార్లమెంటులో చట్టం జర గాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ఆ తర్వాత పంజాబ్‌ రాష్ట్రం కూడా ఇదే తరహా బిల్లు పాస్‌ చేసింది. దీనిపై కూడా కేసు సుప్రీంకోర్టులో నడిచింది. అయితే, మరో అయిదుగురు న్యాయ మూర్తుల ధర్మాసనం ఈసారి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆయా రాష్ట్రాల పరిధిలో కులగణనబట్టి వర్గీకరణను చేపట్టే అంశం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని వివరించింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా తెరాస (భారాస) ప్రభుత్వం అసెంబ్లి లో అనేక సార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపించినా ఎటువంటి కదలిక రాలేదు.

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం రెండు కేసుల్లో విభిన్న తీర్పులను వెలువరించడంతో సమస్య మళ్లి మొదటికి వచ్చింది. దీనిపై సుప్రీమ్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంకు కేసు వెళ్లింది. దీనిపై త్వరలో తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు కూడా అనుకూల చట్టం చేస్తే ఇకపై ఎటువంటి ఆటంకాలు ఎదురుకావని పోరాటాలు మొదలయ్యాయి. వర్గీకరణ ఊపిరిగా ఉద్యమం సాగిస్తున్న ఎమ్మార్పీఎస్‌ మరో అడుగు ముందుకు వేసి నేడు మాదగల విశ్వరూప మహాసభను హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుపుతోంది.

ఎన్నికలు జరుగుతున్న వేళ… ఎస్సీల్లో అధిక శాతం ఉన్న మాదిగ సామాజికవర్గం జరుపుతున్న ఈ మహాసభను రాజకీయ కోణంలో చూస్తే భాజపా తనకు అనుకూలంగా మార్చుకుంటోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సుదీర్ఘకాలంగా జరుగుతున్న మాదిగ రిజర్వేషన్‌ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం మరింత సులవవుతుందని కమలనాధులు అంతర్గత సమావేశాల్లో అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. వర్గీకరణకు అనుకూలంగా శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి హోదాలో మోడీ నేడు మాదిగ విశ్వరూప గర్జన మహాసభలో ప్రకటించనున్నట్టు చెబుతున్నారు.

తెలంగాణలో మాదిగల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి, పార్లమెంటులో బిల్లు పెట్టనున్నట్టు ప్రధాని మోడీ హామీ ఇస్తే అసెంబ్లిd ఎన్నికల్లో మాదిగల ఓట్లను గంపగుత్తగా పొందవచ్చునన్నది సంఘ్‌పరివార్‌ భావన. ఆశించిన స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగలేదని అసంతృప్తితో ఉన్న యువత ఇప్పటికే భాజపా వైపు చూస్తోందని అంటున్నారు. సంప్రదాయ ఓట్లు, యువతతో పాటు ఇప్పుడు మాదిగ సామాజికవర్గం కూడా తోడైతే ఎన్నికల్లో కచ్చితంగా తమదే పైచేయగా మారుతుందని కమలనాధులు ఆశాభావంతో ఉన్నారు.

- Advertisement -

కమలనాధులు పదునుపెట్టి ఎక్కుపెడుతున్న వర్గీకరణ అస్త్రంతో తెలంగాణలో భాజపాకు అనుకూలంగా పరిస్థితి మారుతుందని, మాదిగ సామాజకవర్గం మద్దతుతో మెజారిటీ స్థానాల్లో గెలుపోటములు తారమారవుతాయని విశ్లేషణలు సాగుతున్నాయి. దీంతో త్రిముఖ పోటీ మరింత రసవత్తరంగా మారుతుందని చెబుతున్నారు. శ్రేణుల్లో ఒక్కసారిగా మళ్లిd జోష్‌ పెరిగిందని, దీన్ని పోలింగ్‌ వరకూ కొనసాగించాలని పరివార్‌కు ఆదేశాలు అందినట్టు సమాచారం. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో దూకుడు మీదున్న భాజపా తాజాగా వర్గీకరణ అస్త్రం సంధించడంతో నాటకీయ పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ పండితులతో పాటు సామాజికవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement