Friday, May 3, 2024

24న మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈనెల 24న మోడల్‌ స్కూల్స్‌ అడ్మిషన్‌ టెస్టును నిర్వహించనున్నట్లు మోడల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ఉషారాణి తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఆరో తరగతిలో ప్రవేశానికి, ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతి వారికి, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆమె సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement