Sunday, September 24, 2023

మేడారం జాత‌ర ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రులు

ములుగు, (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం జరగనున్న ఆసియా ఖండంలోనే అతి పెద్ద మహా జాతర అయిన‌ మేడారం-2022 పనుల పరిశీలన, సమీక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన అభివృద్ధి శాఖమంత్రి సత్యవతి రాథోడ్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ చేరుకున్నారు. జంపన్న వాగులో జంపన్న దేవుడికి మొక్కులు చెల్లించి .. మేడారం వన దేవతలు శ్రీ సమ్మక్క సారక్కలను దర్శించుకున్నారు. వారి వెంట జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ వైస్ ఛైర్మన్ బడే నాగ జ్యోతి, ఎంపీపీ గొంది వాణి శ్రీ, రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, మండల, నియోజకవర్గ, జిల్లా నాయకులు, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement