Tuesday, May 14, 2024

చంద్రయాన్- 3 సక్సెస్ దేశం గర్వించదగ్గ రోజు – ..మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, ఆగస్ట్ 23 (ప్రభ న్యూస్):చంద్ర‌యాన్‌-3 స‌క్సెస్ దేశం గర్వించదగ్గ రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల కృషి ఫ‌లితంచిందని. . చంద్రుని ద‌క్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భార‌త్ చ‌రిత్ర సృష్టించిందని ఆయన అన్నారు. భార‌తీయులుగా మ‌నంద‌రం గ‌ర్వ‌ప‌డేలా చేసిన ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు ఈ సందర్భంగా అభినంద‌న‌లు తెలియజేశారు. భ‌విష్య‌త్‌లో ఇస్రో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుతున్నట్లు మంత్రి తెలిపారు…

  • భారతీయులుగా గర్వించదగ్గ విషయం – డికె.అరుణ
  • )ఇస్రో ప్రవేశపెట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అవ్వడం, భారతదేశం పట్ల ప్రపంచం, భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా డికె. బంగ్లాలో జాతీయ జెండా ఎగురవేసి బాణా సంచా కాల్చి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డికె. ఆరుణ మాట్లాడుతూ..మనందరి ఆకాంక్షల్ని మోసుకెళ్లిన వ్యోమనౌక విజయవంతంగా జాబిల్లిపై అడుగుపెట్టింది….కోట్లాది భారతీయుల కలల్ని నిజం చేస్తూ.. చంద్రయాన్ మిషన్ -3 సక్సెస్ అయింది..చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04 గంటలకు చందమామను చంద్రయాన్-3 ముద్దాడి అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటి చెప్పింది అని అన్నారు.         

Advertisement

తాజా వార్తలు

Advertisement