Wednesday, May 15, 2024

సీఎం కేసీఆర్ అంబేద్కర్ వారసుడు: మోత్కుపల్లి

తెలంగాణలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌పై మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. రాబోయే రోజుల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళిత బంధును ప్రారంభించడం సంతోషకరమన్నారు. నేరుగా దళితుల ఖాతాల్లో రూ.10 లక్షలు వేయడం ఎక్కడా చూడలేదని ఆయన పేర్కొన్నారు. దళితబంధు, దళితులందరికీ వస్తుందనడానికి వాసాలమర్రి నిదర్శనమని చెప్పారు. దళితబంధు హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితమన్నవారు.. ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు.

కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళిత బంధు పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. వాసాలమర్రిలో దళిత బంధు అమలుకు ప్రభుత్వం గురువారం నిధులు మంజూరు చేసింది. గ్రామంలోని మొత్తం 76 కుటుంబాలకు రూ.7.60 కోట్లు విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: గెల్లు శ్రీనివాస్‌ కే హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్!

Advertisement

తాజా వార్తలు

Advertisement